Mahaa Daily Exclusive

  కొండలను కబలిస్తున్న మట్టి మాఫియా అనుమతులు లేని అక్రమ తోలకాలు తెలంగాణ సంపద ఆంధ్ర కి తరలింపు..!

Share

ఎర్రుపాలెం, ఆగస్టు 11, మహా :

ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తూ మైనింగ్ అనుమతులు లేకుండా తమ ఇష్టానుసారంగా అడిగే వారే లేదన్నట్లుగా అక్రమంగా మట్టిని తరలిస్తూ లక్షల రూపాయలను మట్టి మాఫియా అక్రమంగా దోచుకుంటున్నారని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సంబంధిత శాఖ అధికారులు ముడుపుల ముసుగులో చూసి చూడనట్టు ఉదాసీనత కనబరుస్తూ మట్టి మాఫియాకు సహకరిస్తున్నారని అధిక లోడుతో రోడ్లు సర్వ నాశనం చేస్తున్న అక్రమ గ్రావెల్ ముఠాల ఆ టలను అరికట్టే నాధుడే కరువైపోయారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావు ఘాటుగా విమర్శించారు. ఎర్రుపాలెం మండల తహసిల్దార్ మన్నే ఉషా శారదకు గ్రావెల్ తోలకాలకు ఎవరికి ఎటువంటి అనుమతులు ఉన్నాయో కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం వివరించాలని కోరారు. సమాచార హక్కు చట్టం 2025 సెక్షన్ పరిధిలో 6 (1) 7(1) 6(3) 4(4) 2 జె (11) సెక్షన్ల ను అనుసరించి వాటి ప్రకారం పొందుపరిచిన ప్రతి విషయాన్ని ధ్రువీ కరించాలని కోరారు. దరఖాస్తు ద్వారా కోరిన వివరాలు ఎరుపాలెం మండలంలో రెవిన్యూ పరిధిలో కొండలు, క్వారీలు, మట్టిగుట్టలు ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని ఉన్నాయో సమాచారం తెలపాలన్నారు. వాటిని ఉపయోగించుకోవటానికి ఏ గుట్టలకు ఎవరికి ఎంత పరిధిలో మైనింగ్ పరంగా అనుమతులు పొంది ఉన్నారో తెలపాలన్నారు. ప్రస్తుతానికి ప్రతిరోజు వందలాది వాహనాల ద్వారా అక్రమ చేస్తున్నారని, వాహనాలకు ఆర్టీవో శాఖ వారు ఇచ్చిన పరిమితకు మించి ఓవర్ లోడ్ తో మట్టిని తరలిస్తున్నారని వీటి ద్వారా ప్రభుత్వానికి గ్రామపంచాయతీలకి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలన్నారు. ఎవరికైనా లీజు పర్మిషన్ ఉన్నట్లయితే గనులు, భూగర్భ,పర్యావరణ శాఖల నిబంధనలకు లోబడి ఎన్ని క్యూబిక్ మీటర్లు విస్తీర్ణంకు అనుమతి కలిగి ఉన్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వం దృష్టికి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై ఏ శాఖలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారో ఎన్ని పెనాల్టీలు విధించి ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూర్చారో సంబంధిత విషయాలన్నిటికీ పూర్తి సమాచారం తెలపాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సగుర్తి సంజీవరావు, నాగులవంచ వెంకట్రామయ్య, దూదిగo బసవయ్య, తదితరులు పాల్గొన్నారు.