హన్మకొండ మహా;
క్రీడల్లో రాణించే పోలీస్ అధికారులు, సిబ్బందిని ప్రోత్సాహం అందించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెఎన్ ఎస్ గ్రౌండ్లో నిర్వహించిన లాన్ టెన్నిస్ పోటీల్లో డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన ఏ. ఆర్ ఏసీపీ నాగయ్య, రిజర్వ్ ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ ను పోలీస్ కమిషనర్ సోమవారం సీపీ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో బిజీగా వుండే పోలీసులకు క్రీడలు అటవీడుపుగా వుండటంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని. ముఖ్యంగా క్రీడల్లో రాణించే వారికి శాఖపరమైన ప్రోత్సాహకాలతో పాటు నగదు రివార్డ్ లను అందజేయడం జరుగుతుందని సీపీ తెలిపారు.
Post Views: 56








