వరంగల్ మహా;
నులిపురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యమని వరంగల్ జిల్లా కలెక్టర్
డాక్టర్ సత్య శారద అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ నులిపురుగుల మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
జిల్లా వ్యాప్తంగా లక్ష 98 వేల మంది బాలబాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేస్తున్నట్లు చెప్పారు. ఒక సంవత్సరం నుండి 2సం.లు ఉన్న చిన్నారులకు భోజనం తరువాత అల్బెండజోల్ సగం మాత్ర, 3సం.ల నుండి 19సం.ల విద్యార్థులకు అల్బెండజోల్ ఒక మాత్ర భోజనం అనంతరం అందజేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ నులి పురుగుల వల్ల ఆహారం జీర్ణం కాకపోవడం, రక్తహీనత తదితర అనారోగ్య రుగ్మతలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మాత్రలను తీసుకోవడం వల్ల రక్తహీనతను నిర్మూలించడంతో పాటు పోషకాహార ద్వారా వ్యాధినిరోధక శక్తిని మెరుగుపడుతుందని కలెక్టర్ కు తెలిపారు. ముఖ్యంగా ఈ నులిపురుగులు అపరిశుభ్రమైన ఆహారం, కలుషితమైన నీరు
తీసుకోవడం వల్ల నులి పురుగులు ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు.
చేతులు శుభ్రంగా కడుక్కొని ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలిపారు. ఒకవేళ ఈ రోజు పొరపాటున సదరు మాత్రలు తీసుకొని వారికి మరల ఆగస్టు 18వ తేదిన మాప్-అప్ కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మాత్రల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. జ్వరం ఉన్నపుడు ఈ మాత్రలను తీసుకోకూడదన్నారు. అనంతరం ధర్మారం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి చిన్నారులకు స్వయంగా అల్బెన్దజోల్ మాత్రలు వేశారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, డిడబ్ల్యూ ఓ రాజమణి, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ ప్రకాష్ డాక్టర్, కొమురయ్య, తహసీల్దార్ రియూజుద్దీన్, ఎంపిడిఓ శ్రీనివాస్, డాక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








