Mahaa Daily Exclusive

  రెండు పడకల గదుల గృహ సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్, కమిషనర్ ఎమ్మెల్యే..!

Share

వరంగల్ మహా;

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్ లో  రెండు పడకల గదుల గృహ సముదాయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ,
మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయి లతో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించి పరిశీలించారు.
320 2bhk సముదాయాన్ని త్వరలో ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చే ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు అందజేయుటకు గాను ప్రణాళికలు సిద్ధం చేయుటలో భాగంగా ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో రామిరెడ్డి, హౌసింగ్ పిడి గణపతి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, వార్డ్ నెంబర్  జ్యోతి ,ఎలక్ట్రిసిటీ ఏఈ, మున్సిపల్ ఏఇ,
తదితరులు పాల్గొన్నారు.