TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు మంగళవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి వద్ద కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, కార్యక్రమానికి జంట నగరాల్లోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కుంకుమార్చనకు తరలివస్తారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లకుండా రాంచందర్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దమ్మ గుడి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.
Post Views: 92








