TG: గ్రామపాలన అధికారుల(GPO)కు ఈ నెల 15న నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ చేతులమీదుగా ఈ పత్రాలు అందించే కార్యక్రమం నిర్వహణకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు విడతలుగా చేపట్టిన నియామకాల్లో 5వేల మంది ఎంపికయ్యారు. మరోవైపు రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరించేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలపై మంగళవారం CMసమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Post Views: 99








