Mahaa Daily Exclusive

  తెలంగాణలో 4 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు..!

Share

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చిరకలు జారీ చేసింది. బుధవారం అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపటి (ఆగస్టు 13) నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు ఇతర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. నేడు రాష్ట్రంలోని హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.