AP: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చకు రావాలంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు విసిరిన సవాల్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టును ముంచింది జగన్ అయితే, దాన్ని పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారన్నారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అనగాని మాట్లాడుతూ.. జగన్ పోలవరం ప్రాజెక్టును వరదల్లో ముంచి, రివర్స్ టెండరింగ్ అనే పేరుతో డయాఫ్రం వాల్‌ను పూర్తిగా విధ్వంసం చేశారని ఆరోపించారు.








