Mahaa Daily Exclusive

  బిజెపి అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ అర్వింద్..? రేసులో యువ ఎంపీ..

Share

  • బిజెపి అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ అర్వింద్?
  • రేసులో యువ ఎంపీ
  • వరుసగా రెండోసారి నెగ్గింది ముగ్గురే
  • అందులో ఇద్దరు కేంద్రమంత్రులు.. మిగిలింది అర్విందే
  • సానుకూలంగా ప్రధాని మోడీ

హైదరాబాద్, వేదిక బ్యూరో

బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులోకి ఇందూరు ఎంపీ, ఫైర్ బ్రాండ్ లీడర్ ధర్మపురి అర్వింద్ వచ్చారు. గత కొద్దిరోజులుగా బిజెపి అధ్యక్షపదవికి అనేక పేర్లు వినిపించినా, ఇపుడు కీలక దశలో ధర్మపురి అర్వింద్ పేరును అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తోంది. బిజెపి నుండి ఎనిమిది మంది ఎంపీలు గెలవగా, రెండోసారి గెలిచిన వారిలో ఒక్క ధర్మపురి అర్వింద్ తప్ప ఇద్దరూ కేంద్రమంత్రులయ్యారు. వరుసగా గెలవడంతో పాటు దమ్మున్నలీడర్ గా, యువతను సమ్మోహపరిచే నాయకుడిగా ధర్మపురి అర్వింద్ కు పేరుంది. ఇందూరుపై నిర్లక్ష్యం చూపుతున్నారన్న వార్తల నేపథ్యంలో యువనేతకు ప్రమోషన్ అంశాన్ని ప్రధాని మోడీ, అమిత్ షాలు సీరియస్ గా పరిశీలిస్తున్నారు.
……..