Mahaa Daily Exclusive

  కంది శ్రీ‌నివాస రెడ్డికి గంగ‌పుత్ర సంఘం కృత‌జ్ఞ‌త‌లు..!

Share

ఆదిలాబాద్ మ‌హా : గంగ పుత్ర సంక్షేమ సంఘం షెడ్డు నిర్మాణం కోసం ఎస్డీఎఫ్ నిధుల నుండి 5ల‌క్ష‌లు రూపాయ‌లు కేటాయించిన అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డికి సంఘం జిల్లా అధ్య‌క్షులు ఎల్లుల భోజ‌న్న ధ‌న్య‌వాదాలు తెలిపారు. నిధులు విడుద‌ల‌ కావ‌డంతో జిల్లా గంగపుత్ర సంఘం ఆఫీసులో షెడ్డు ప‌నుల కోసం భూమి పూజ జరిపిన‌ట్టు తెలిపారు. మున్ముందు కూడా గంగంపుత్రుల సంక్షేమం అభివృద్ధి కోసం పాడుప‌డ‌తాన‌న్న కంది శ్రీనివాస రెడ్డికి తాము రుణ‌ప‌డి ఉంటామ‌ని అన్నారు. ఆయ‌న‌కు కూడా ఎల్ల‌వేళ‌లా త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సంఘం కార్యదర్శి మేకల అశోక్, డైరెక్టర్లు , కులస్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు

Latest