ఆదిలాబాద్ మహా: స్థానిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. పట్టణానికి చెందిన ప్రముఖులు రిటైర్డ్ ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ఇటీవలే రిటైర్డ్ ఎమ్ ఈవో కోలా నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా బుధవారం ఎస్సీ కార్పోరేషన్ రిటైర్డ్ సూపరింటిండెంట్ ఉష్కం శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంది శ్రీనివాస రెడ్డి ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి స్వాగతించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Post Views: 48








