భారతదేశంలో 2024 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఎర్రకోట దాని చుట్టుపక్కల ప్రాంతాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇప్పటినుంచే భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన, ప్రజలందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు ఆగస్టు 15. బ్రిటిష్ పాలనలోని దాస్య శృంఖలాలను ఛేదించుకొని భరతమాత స్వేచ్ఛగా గర్వంగా తలెత్తుకున్న రోజు ఆగస్టు 15.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట వేదిక అటువంటి ఆగస్టు 15 ను భారతదేశ స్వాతంత్ర దినోత్సవంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దేశం పట్ల తమ దేశభక్తిని చాటుతారు. అయితే ప్రతి సంవత్సరం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబు అవుతోంది.
ఈసారి ఏఐ ఆధారిత భద్రతా వ్యవస్థ ప్రతి సంవత్సరం భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు టెర్రరిస్టులు విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాటిని దీటుగా ఎదుర్కొంటూ, ఉగ్రవాదానికి చెక్ పెడుతూ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం కూడా ఎర్రకోట వద్ద పటిష్టమైన నిఘా మధ్య ఆటోమేటెడ్ క్రౌడ్ ఎస్టిమేషన్ సౌకర్యాలతో కృత్రిమ మేధస్సు ఆధారిత భద్రత వ్యవస్థలను అమలు చేయనున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి.
కృత్రిమ మేధస్సుతో భద్రతలో బోలెడు ఫీచర్లు ఎర్రకోట వద్ద వీడియో అన్నలెటిక్స్ ఫీచర్లతో కూడిన సిసి టీవీలు ముఖ్యమైన వేదికలు, ప్రదేశాలలో అమర్చబడతాయని తెలుస్తోంది ఇంటిలిజెన్స్ వీడియో సర్వైలేన్స్ సిస్టంలో వాహనం నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం, ఫేస్ డిటెక్షన్, పీపుల్ మూమెంట్ కౌంటింగ్, ట్రిప్ వైర్, ఆడియో డిటెక్షన్, చొొరబాటు, డి ఫోకస్ మరియు అనుమానాస్పద వస్తువులను గుర్తించడం వంటి ఫీచర్లు భద్రత వ్యవస్థలో ఉంటాయి.
ప్రమాదాన్ని ముందే పసిగట్టగల భద్రతా వ్యవస్థ ఏఐ ఆధారిత సాయిధ కెమెరాలను ఉపయోగించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రాంగణంలోకి వచ్చే వ్యక్తుల ప్రవేశాన్ని, నిష్క్రమణం జాగ్రత్తగా గమనిస్తామని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదాన్ని ముందే పసిగట్ట గల భద్రతా వ్యవస్థ ద్వారా భద్రత మెరుగుపడుతుందని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు 700 కంటే ఎక్కువ సిటీ వీలు 150 కి పైగా కెమెరాలను వీడియో అనలిటిక్స్ ఫీచర్లతో అమర్చనున్నారని పేర్కొన్నారు.
పదివేలకు మందికి పైగా భద్రతా సిబ్బంది మొత్తం పదివేల మందికి పైగా భద్రత సిబ్బంది ఎర్రకోట మరియు సెంట్రల్ మరియు ఉత్తర ఢిల్లీలోని కీలక ప్రదేశాలను పరిరక్షిస్తారని పేర్కొన్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరియు భద్రతా సంస్థల బృందం ఎర్రకోటన సందర్శించి స్వాతంత్ర్య దినోత్సవం కోసం భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించింద,ని పటిష్టమైన నిఘాతో ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయని వారు తెలిపారు.








