Mahaa Daily Exclusive

  ఆదిభట్ల సర్కిల్ పరిధిలో స్పెషల్ శానిటేషన్…. ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి….

Share

రంగారెడ్డి జిల్లా మహా:

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ ఆదేశానుసారం, ఆదిభట్ల సర్కిల్లో సోమవారం నుండి గురువారం వరకు నిర్వహించే స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాన్ని ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి.సత్యనారాయణ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ ఫుట్ పాత్, ఫ్లై ఓవర్ బ్రిడ్జి క్రింద రోడ్ సైడ్ గార్బేజ్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఈఈ ఎస్డబ్ల్యూఎం స్వర్ణ కుమార్, ఏఈఈ యోగేష్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ భాస్కర్, వనిత, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సురేష్, రాజేష్, శానిటేషన్ జవాన్ మల్లారెడ్డి శానిటేషన్ సిబ్బంది కలిసి పాల్గొనడం జరిగింది.

Latest