Mahaa Daily Exclusive

  ఇబ్రహీంపట్నంలో యదేచ్ఛగా మట్టి తవ్వకాలు..

Share

ప్రభుత్వ ఆదాయానికి గండి
చోద్యం చూస్తున్న మైనింగ్ జిల్లా అధికారులు.?
లక్షల్లో సంపాదిస్తున్న అక్రమార్కులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
జిల్లాలో యదేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్న నిమ్మకు నీరెత్తనట్టుగా జిల్లా మైనింగ్ అధికారుల వ్యవహార తీరుపై పలువురు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల సరిహద్దు, సీతారాంపేట్, జనహర్షలో మట్టి మాఫియా అక్రమార్కులు యదేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఏలాంటి మైనింగ్ అనుమతులు లేకుండా రాత్రి పగలు మట్టి తవ్వకాలు జరుపుతున్నా, అధికారులు స్పందించకపోవడం, అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అసలు మైనింగ్ శాఖ ఉందా అనే ప్రశ్న ప్రజలలో ఉత్పన్నమవుతుంది. ఉంటే ఇంత జరుగుతున్న చర్యలు తీసుకోకపోవడంలా అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మైనింగ్ అధికారి దృష్టిసారించి అక్రమాలపై అడ్డుకట్ట వేయాలని పలువురు తెలిపారు.

Latest