Mahaa Daily Exclusive

  సమాజ నిర్మాణంలో టీచర్ల దే కీలక పాత్ర … సీఎం పీఆర్వో దూదిపాళ్ళ విజయ్….

Share

కారేపల్లి, మహా: ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్వో దూదిపాళ్ళ విజయ్ కుమార్ అన్నారు. కారేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో సైన్స్ టీచర్ గా చేసి ఉద్యోగ విరమణ చేసిన భీమవరపు కమల పదవీ విరమణ సన్మానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఎం పీఆర్వో దూదిపాళ్ళ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కొత్త కమలాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అందించిన కమల టీచర్ నాతోపాటు నా గ్రామంలో ఎంతోమంది ఉన్నత స్థితికి చేరడానికి దోహదపడ్డారని కొనియాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు జ్ఞానాన్ని నైపుణ్యాలను నేర్పించి వారిని సరైన మార్గంలో నడిపించే మార్గదర్శకులని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కు సరైన దిశా నిర్దేశం చేస్తూ ఎందరినో తీర్చిదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపగల శక్తి వంతులు ఉపాధ్యాయులే నని అన్నారు. అనంతరం కమల శ్రీనివాసరావు దంపతులను శాలువాతో సన్మానించారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, బంధువులు, విద్యార్థులు కమల శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి సర్పంచ్ మేదరి వీరప్రతాప్, సింగరేణి కాలరీస్ డీజీఎం హరి ప్రసాద్, హైస్కూల్ హెడ్మాస్టర్ శ్యామ్, కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, రిటైర్డ్ ఎంఈఓ లు నున్న అప్పారావు, యేసుదాసు, రిటైర్డ్ ఉపాధ్యాయులు గాలి రంగారావు, ఎండీ బాబు, చెవుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Latest