- కొండగట్టు అభివృద్ధికి
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి.. - పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తాం..
- మాస్టర్ ప్లాన్ ప్రకారం కొండగట్టు
దశ దిశ మార్చేస్తాం.. - పవన్ కళ్యాణ్ పర్యటనకు
పకడ్బందీ ఏర్పాట్లు..
చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం
జగిత్యాల కలెక్టర్ ఎస్పీతో కలిసి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన
కరీంనగర్ మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండగట్టు ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని కరీంనగర్ డిసిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. పక్క ప్రణాళిక మాస్టర్ ప్రకారం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జనవరి 3 వ తేదీన కొండగట్టు పర్యటన పురస్కరించుకొని బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా, పకడ్బందీగా చేపట్టాలని ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని సూచించారు. ప్రత్యేక రూట్ మ్యాప్ ద్వారా ప్రత్యేక పూజలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీ కలిసి కొండగట్టు అంజన్న మీ ఆరాధ్య దైవమని ఈ దేవాలయానికి మీరు కొంత సహాయం చేయాలని కోరడంతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ కు ప్రత్యేకంగా లేఖలు రాశానని తెలిపారు. దీంతోపాటు దానికి అనుగుణంగా ప్రయత్నాలు చేయడం ద్వారా కొంత ఆలస్యమైనప్పటికీ పవన్ కళ్యాణ్ స్పందించి దాదాపు 36 కోట్ల రూపాయలు కొండగట్టు ఆలయానికి మంజూరు చేయించారని తెలిపారు 100 గదుల వసతి గృహంతో పాటు మాల విరమణ మండపం కట్టిస్తామని హామీ ఇచ్చారని పనులు ప్రారంభించేందుకు ఈ నెల మూడో తేదీన పవన్ కళ్యాణ్ తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 3వ తేదీన పవన్ కళ్యాణ్ తో కలిసి 100 గదుల నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండగట్టు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, పూర్తిస్థాయి ప్రణాళిక తీసుకురావాలని ఆదేశించారని పేర్కొన్నారు.
త్వరలోనే పక్కా ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ తో ముఖ్యమంత్రిని కలుస్తామని, కొండగట్టు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అన్ని కార్యక్రమాలన చేపడతామని చెప్పారు. కొండగట్టు అభివృద్ధికి మేము ఏమో చేశామని మాట్లాడే బిఆర్ఎస్ నేతలు, ప్రజలకు ఏం చేశారో, నిరుద్యోగులకు ఏం చేశారో, రైతులకు ఏమి చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలనీ ప్రశ్నించారు. జగిత్యాల డిఎస్పి రఘుచందర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.








