Mahaa Daily Exclusive

  తెలంగాణ బార్ కౌన్సిల్ నామినేషన్ల ప్రక్రియ పూర్తి 200కు పైగా దరఖాస్తులు

Share

హైదరాబాద్ సిటీ, మహా

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో విజయవంతంగా పూర్తయ్యింది. 200 మందికి పైగా వివిధ పదవులకు దరఖాస్తులు చేశారు. ఇందులో యువ, సీనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, 30 శాతం మహిళా రిజర్వేషన్ కారణంగా మహిళా న్యాయవాదులు కూడా ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్‌కు సంబంధించిన న్యాయవాదులు జితేందర్ రెడ్డి , జే. లక్ష్మణ్ , పి. రవీందర్ తదితరులు నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. న్యాయవృత్తిలో ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే విధంగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించబడిందని, బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల దశ పూర్తికావడంతో తదుపరి ఎన్నికల ప్రక్రియ జరగనుంది.