- ఆరుట్లలోని తెలంగాణ అరకుపై పోలీసుల దాడి
- ఎలాంటి అనుమతులు లేకుండా 31 సెలబ్రేషన్
- నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి
- మంచాల పోలీస్ స్టేషన్ సిఐ మధు వెల్లడి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ అరకులో అనుమతులు లేకుండా 31 సెలబ్రేషన్ చేస్తున్నాడంతో పోలీసులు దాడి చేశారు. రాష్ట్ర డిజిపి ఆదేశాలను బేఖాతలరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా 31 సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధి, ఆరుట్ల రెవెన్యూ పరిధిలోని తెలంగాణ అరకు రిసార్టులో ఎలాంటి అనుమతులు లేకుండా 31 సెలబ్రేషన్ నిర్వహిస్తుండగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి సెలబ్రేషన్ భగ్నం చేశారు. అనుమతులు లేకుండా ప్రోగ్రాం నిర్వహించడంపై సీఐ మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ఆర్గనైజర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. సౌండ్ సెట్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ యొక్క 31 సెలబ్రేషన్ కార్యక్రమంలో దాదాపు 50 నుంచి ఉన్న మంది పాల్గొన్నట్లు తెలిపారు.
అనుమతులు లేకుండా ప్రోగ్రాం నిర్వహించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ మధు వెల్లడించారు. ఆగపల్లి గ్రామంలోని లా సెరెనా రిసార్టులో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రోగ్రాంను నిలిపివేసిన మంచాల పోలీసులు.







