- శివార్లలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
- బిర్యాని తిని ఒకరు మృతి, మరో 15 మంది అపస్మారక స్థితిలో
హైదరాబాద్, మహా : నూతన సంవత్సర వేడుకల్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాదు శివార్లలోని జీడిమెట్లలో విషాదకరమైన సంఘటన జరిగింది. జీడిమెట్లలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భవానినగర్ లో నూతన సంవత్సరం పురస్కరించుకొని 17 మంది వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారంతా మద్యం సేవించి బిర్యానీ తిన్నారు. అనంతరం ఒక్కసారిగా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాధితులను చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివిధ కోణాలలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 40








