గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, డీకేటీ భూములు, కాలువ భూములు, వంకలు, వాగులు కబ్జాలు చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వ భూములతో పాటు అడవులు కూడా వైసీపీ నాయకులు కబ్జా చేశారని, అటవి ప్రాంతాలను కూడా ఆక్రమించారని వెలుగు చూడడం హాట్ పిక్ అయ్యింది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అడ్డంగా ప్రభుత్వ భూములు దోచుకున్న వైసీపీ నాయకులు ఎవరెవరు ?అంటూ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న హయాంలో రాయలసీమలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా ఇతర పార్టీల నాయకులు ఆరోపణలు చెయ్యడం సర్వసాదారణం అయ్యింది. పలు ప్రాంతాల్లో వైసీపీ నాయకుల కబ్జాలను ఆధారాలతో సహ బయటపెడుతున్నారు.
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో సుమారు 120 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కొందరు స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని వెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది. కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల మండలంలోని సీతాపురం గ్రామ పరిధిలో అటవీ ప్రాంతం ఉంది. గత రెండేళ్ల నుండి అటవీ ప్రాంతాన్ని కొంచెం కొంచెం భూమిని కబ్జా చేశారని వెలుగు చూసింది. ఇప్పటికే ఆ ప్రాంతంలోనే టీడీపీ, జనసేన నాయకులు కూటమి ప్రభుత్వానికి ఈ విషయంపై సమాచారం ఇచ్చారు.
సుమారు 120 ఎకరాల అటవీ ప్రాంతంలోని చెట్లను కొట్టేసి, అక్కడ ఉన్న రాళ్లను చదును చేసిన కొందరు వైసీపీ నాయకులు ఆ భూముల్లో పంటలు పెట్టుకుంటున్నారని వెలుగు చూసింది. ఈ 120 ఎకరాల అటవీ ప్రాంతంలో టేకు చెట్లు, పెద్ద పెద్ద రాళ్లు ఉండేవని స్థానికులు అంటున్నారు. టేకు చెట్లు పూర్తిగా కొట్టేసిన తర్వాత అటవి శాఖలోని కొందరితో కుమ్మక్కు అయ్యి వాటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారని తెలిసింది.
అటవి ప్రాంతంలోని రాళ్లను అక్కడి నుండి తొలగిం,చి ఆ భూమిని చదును చేశారు. ఆ తర్వాత అటవి శాఖ సిబ్బందితో కొమ్మక్కు అయ్యి టేకు చెట్లు మొత్తం విక్రయించారని వెలుగు చూసింది. చదును చేసిన అటవీ భూమిలో చామంతి పూలు, చిక్కుడు కాయలు, కందులు, చీని తోటలు పంటలు వేసి సాగు చేస్తున్నారని వెలుగు చూసింది. కొంతమంది వైసీపీ నాయకులు గ్రూపులుగా ఏర్పడి సుమారు 120 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఆక్రమించారని వెలుగు చూసింది.
ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడంతో ఆలస్యంగా కళ్ళు తెరిచిన అటవీ శాఖ అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు నివేదిక కోరడంతో అటవీ శాఖ అధికారులు సతమతం అవుతున్నారని తెలిసింది. కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది. కర్నూలు జిల్లాలోని అటవి ప్రాంతం భూముల వ్యవహారం గురించి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీస్తున్నారని సమాచారం.








