- ‘ఖాకీ ‘లను నిలదీసిన గ్రామస్ధులు
- యసై సాయికిషోర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్.
- దమ్మపేట పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత.
- గంటకు పైగా ఆందోళన చేసిన బాదితులు.
- డియస్పీ సతీష్ కుమార్ హామీతో వెనుతిరిగిన గ్రామస్ధులు.
- పేకాట దాడిలో అమానుషంగా ప్రవర్తించారంటూ బాదితుల ఆరోపణ.
దమ్మపేట ,ఏప్రిల్ 15 మహా :
పేకాట స్ధావరాలపై దాడి చేసి పోలీసుల అదుపులోకి తీసుకున్న ఓ ఘటన స్ధానికంగా దుమారం రేపింది. ఏకంగా స్టేషన్ యసై సాయికిషోర్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునేలా పరిస్తితి లు గోచరించాయి. పోలీసు స్టేషన్ ఎదుట దాదాపుగా 100 మంది బాదితుల సమక్షంలో గంట సేపు పోలీసులకు ,బాదితుల కు వాగ్వివాదం చోటుచేసుకుంది. చిట్టచివరకు పాల్వంచ డియస్పీ సతీష్ కుమార్ చొరవతో ,ఆయన ఇచ్చిన హామీ మేరకు బాదితులు శాంతించారు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే……
దమ్మపేట మండలంలో గంజాయి ,గుట్కా ,పేకాట,ఇసుక ,అక్రమ మట్టి రవాణా వంటి అసాంఘిక,చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన ఘనత యసై .సాయికిషోర్ రెడ్డికి దక్కింది. ఈ నేపద్యంలో గత రెండురోజుల క్రింద మండలంలోని దురదపాడు గ్రామ శివారులో పేకాట ఆడుతున్న కొందరు వ్యక్తులపై మెరుపుదాడులు చేసి చాకచక్యంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి కొంత నగదు ,వాహనాలు స్వాధిన పరుచుకున్నారు. ఇంకొందరు పరారీలో ఉన్నట్లు మీడియా కు సమాచారాన్ని అందించి ,తద్వారా వెల్లడించారు. ఇంతవరకు సజావుగానే ఉంది.
కానీ పేకాట కేసులో పట్టుబడిన వారిని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు చేయాల్సి ఉండగా వారిపై భౌతిక దాడులకు పాల్పడ్డారంటూ దురదపాడు కాలనీకి చెందిన కొందరు యువకులు దమ్మపేట పోలీసులను బుధవారం రోడ్డుపై నిలదీశారు. స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ,యసై ను సస్పెండ్ చేయాలంటూ నినదించారు. అంతేకాకుండా పేకాట కేసులో లేని ఓ అనారోగ్య వ్యక్తి పై కూడా భౌతికంగా దాడి చేసి తీవ్ర మనస్ధాపానికి గురి చేశారని బాదితులు ఆవేదన వ్యక్తంచేశారు.
భౌతికంగా పోలీసులు ఎందుకు దాడి చేసారంటూ పోలీసులను ప్రశ్నించారు. వెంటనే యసై పై కేసునమోదు చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతంగా చేస్తామని హెచ్చరించారు. అశ్వారావుపేట సిఐ జోక్యం చేసుకొని బాదితుల కు నచ్చజెప్పే ప్రయత్నం విఫలం అయ్యింది. సమాచారం తెలుసుకున్న పాల్వంచ డియస్పీ సతీష్ కుమార్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ , ససేమిరా బాదితులు ఒప్పుకోలేదు. చివరకు యసై పై కేసు నమోదు చేస్తానని స్పష్టమైన హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా బాదితులు ఉపశమనం పొందారు. ఏది ఏమైనప్పటికీ మండలంలో సిఎం పర్యటన సమయంలో ఖాకీల పై నిరసన లు చేయడం పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
—————








