Mahaa Daily Exclusive

  నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం: ఎగ్ కార్డ్స్ పంపిణీలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు

Share

*నిరుద్యోగులకు అండగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు*

*ఎగ్ కార్డ్స్ ను పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు*

మహా వరంగల్ బ్యూరో;

వరంగల్ నగరం ఓ సిటీ లోనీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసం దగ్గర బుధవారం ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎన్ ఇ సి సి జోనల్ ఛైర్మన్, వరంగల్, జోన్ నివాసం నందు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అధ్యక్షతన ఎగ్ కార్డ్స్ ను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సుమారు 100 మంధి లబ్ధిదారులకు ఎగ్ కార్డ్స్ తో పాటు ఇతర సామాగ్రిని ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామ్ చందర్ రావు పాల్గొని లబ్ధిదారులకు ఎగ్ కార్డ్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ నెక్ జాతీయ అధ్యక్షురాలు అనురాధ దేశాయ్ డ్రీం ప్రాజెక్ట్ అయిన ఎగ్ కార్డ్స్ స్కీం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా కోడిగుడ్ల వినియోగం పెంపొందించుటకు ఈ స్కీం ను ప్రవేశపెట్టడం జరిగింది. కావున లబ్ధిదారులందరూ ఈ స్కీం ను సద్వినియోగం చేసుకొని మీరు ఉపాధి పొందుతూ ఇతరులకు మార్గదర్శకం కావాలని కోరారు.

Latest