- వరంగల్ కి వడదెబ్బ
- ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు
- ఉదయం 8 నుంచి భానుడి ప్రతాపం
- ఇంట్లో నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్న ప్రజలు**
- చిరు వ్యాపారులు, ఆటో వారు, టూ వీలర్స్ పై ప్రయాణం చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు
- ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ పరదాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రయాణికులు
- ప్రధాన కూడళ్ల వద్ద మంచినీటి సదుపాయం కల్పించాలని ప్రజలు అధికారులకు సూచిస్తున్నారు
యాంకర్ వాయిస్ :ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి, సూర్యుడి యొక్క ప్రతాపం ఉదయం నుండే కనబడుతుంది, ఉదయం 8 గంటల తర్వాత నుండి సూర్యుని యొక్క ప్రతాపం వల్ల ప్రజలు చుక్కలు చూస్తున్నారు. భానుడి భగభగతో ప్రజలు అల్లాడిపోతున్నారు, ప్రజల బయటికి రావాలంటే జంకుతున్నారు, ఇళ్లకు పరిమితమైన వారు కూడా ఎండ తీవ్రతకి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. పేరుగుతున్న ఉష్ణోగ్రతలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు .12 గంటల నుంచి నాలుగు గంటల సమయం వరకు ఇంట్లోనే ఉండాలంటూ వారు సూచిస్తున్నారు.. ప్రతి రెండు గంటలకు ఓసారి రెండు గ్లాసుల మంచినీళ్లు తీసుకోవడం ఉత్తమమంటున్నారు డాక్టర్స్ .. అదే విధంగా లోదుస్తులు, కాటన్ దుస్తులు వాడడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.. ఎండ వల్ల ముఖ్యంగా టైఫాయిడ్, గవద బిళ్ళలు, పోగు,అతి సారా, కామర్లు అధికంగా వ్యాప్తిస్తాయ్ నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టూ వీలర్స్ ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ పరధాలు అమర్చితే కొంత ఉపశమనం కలుగుతుంది అని ప్రజలు అధికారులకు తెలుపుతున్నారు. వరంగల్ లో ఎండల తీవ్రత పై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు.








