మత్తు గమ్మత్తు
॥మత్తులో॥
మత్తులో గమ్మత్తులో మాయమై పోతున్నరమ్మ మనిషన్నవాడు ఉరిలో పెళ్ళి దేవుని సంబరాలుంటే ఊదంత ఒక్కటే సంబరాలు చేస్తుంటే తాగుబోతులకు ఒక్కటిగా వేరి చిందులు వేస్తు కింద పడుతుంటారు ॥మత్తులో॥
పాఠశాలలో పిల్లలు కాలేజిలో విద్యార్థులు గంజాయి చాకెట్లు గుటుక్కున మింగి హెరాయిన్ నల్లమందు కడుపునిండా పీల్చి నదిరోడ్డుపై అర్ధనగ్నడ్యాన్సులు చేస్తారు ॥ మత్తులో॥
వయస్సు మీద ఉన్న పొగరో మత్తులో ఉన్న రిమ్మ తెగులో వావి వరసులు మరిచి ఒక్కటైపోతారు.
సమాజానికే చెడ్డపేరు తెస్తున్నారు. గోల్డ్ మెడల్స్ సాధించిన సోదరులు గడ్డాలు జుట్టులు పెంచినారు బీరుబ్రాంది విసమ్ జిన్ల వెంటపడ్డారు.
సర్వం ఇదే అని సర్వనాశనం అవుతున్నారు.
డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అవుతారని పెద్ద చదువుల కోసం పట్టణాలకి పంపిస్తే కొకైన్ తిన్నాడు కొంగు చేత పట్టినాడు. చల్లని బీరు తాగి చికెన్ 65 తిన్నాడు రయ్ మని రోడ్డుమీదకి వెళ్లినాడు. లారీని గుదిండు కానరాని లోకాలకు వెళ్ళినాడు॥ మత్తులో॥
మత్తులోన హత్యులు చేసి
లాఠీలతో ఒళ్ళంతా విరిగిపోయే
ఎవరు కోసం ఈ దారుణాలు
కన్నవారి బందాన్ని కాలరిస్తివి అలీబిడ్డలను అనాథలను చేస్తిరి అద్దాలమేడలో అంగరంగ జీవితాలు కూలి బతుకులతో కష్టాలు జీవితాలు మత్తు పదార్థాలకు ఎవరు ఎక్కువ కారుగా వీధుల నుండి విశ్వం వరకు మత్తు మాఫియా విస్తరించిరా ఆలోచించండి అయ్యలో ఓ అమ్మల్లో మాయదారి మత్తు పదార్థాల జోలికి పోవద్దురా మత్తుమాయరా నీజీవితం చిత్తురా ॥మత్తుతో॥
తల్లితండ్రుల జీవితాలు పోరాట యోధుల త్యాగాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకో భారతమ్మ బిడ్డగా గొప్పగా జీవించురా ॥మత్తుతో॥
గోపిశెట్టి వెంకటేశ్వరరావు
యం.ఎ.బిఇడి.,
విశ్రాంత ఉపాధ్యాయులు
9676668991
రంగారావుబంజర్, పెనుబల్లి మండలం,
ఖమ్మం జిల్లా -507302








