*జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఇబ్బందులు పెడుతున్నారనేది అవాస్తవం*
*కథనాలను ముక్తకంఠంతో ఖండించిన తెలంగాణ జేఏసీ వరంగల్ జిల్లా శాఖ*
వరంగల్ మహా;
తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటి వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ పై పలు పత్రికల్లో వచ్చిన కథనాల పై స్పందిస్తూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ జేఏసీ నాయకులు, ఉద్యోగులు మాట్లాడుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పై తేది 15 04 2026, 16 04 2026 తేదీల్లో పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు పూర్తిగా అవాస్తవమని, జిల్లా అధికారులను గాని తెలంగాణ గెజిటెడ్ అధికారులను గాని, ఎన్జీవో లను, జిల్లా యంత్రాంగాన్ని గాని జిల్లా కలెక్టర్ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదని స్పష్టం చేశారు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అని నిబద్ధతతో నిత్యం ప్రజల్లోనే ఉంటూ జాతీయ స్థాయిలో వరంగల్ జిల్లాకు ఆమె తెచ్చిన గుర్తింపును, చేస్తున్న సేవలను ఓర్వలేక కొంతమంది గిట్టని వారు కలెక్టర్ పై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేయిస్తున్నారని ఇది ఎంత మాత్రం మేం సహించబోమని వీటిని తెలంగాణ జేఏసీ వరంగల్ జిల్లా శాఖ తరపున ముక్త కంఠంతో ఖండిస్తున్నామని వారు తెలిపారు.







