- ఖానాపూర్ గేటు సాగర్ రహదారిపై ప్రమాదం…!
- స్కూల్ బస్సుకు, డిసిఎం వ్యాన్…. డీ…
- స్కూల్ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఇబ్రహీంపట్నం)మహా:
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి, ఖానాపూర్ గేటు సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
సాగర్ హైవే పై వెళుతున్న స్కూల్ బస్సుకు, వెనకనుంచి వచ్చిన డిసిఎం వ్యాన్ ఢీకొట్టడంతో,
డీసీఎంలో ఉన్న వ్యక్తులకు, డ్రైవర్ కు గాయాలు కావడంతో, స్థానికులు 108 వాహనానికి అంబులెన్స్ కు ఫోన్ చేసిన వెంటనే రావడంతో క్షతగాత్రులను అంబులెన్స్ లోకి ఎక్కించి ఇబ్రహీంపట్నంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ యొక్క బస్సు ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది….
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, జరిగిన ప్రమాదాన్ని పరిశీలించడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతామని, ప్రమాదానికి గల కారణాలను తెలియజేస్తామని వెల్లడించారు….
Post Views: 255








