Mahaa Daily Exclusive

  విదేశీ మోజు వద్దు….

Share

* స్వదేశీ విధానమే ముద్దు.
* ఇండియన్ టాయిలెట్ ప్రయోజనాలను వివరిస్తున్న ఉపాసన కొణిదెల.
*వేల కోట్ల ఆస్తి ఉన్నా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్న మెగా కోడలు.
* పాశ్చాత్య టాయిలెట్లకు స్వస్తి పలకాలని పిలుపు.

హైదరాబాద్, మహా.

మెగా కోడలు, అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల తన వినూత్న ఆలోచనలతో, ఆరోగ్యకరమైన జీవనశైలి సూచనలతో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆమె నేటి యువతకు, ప్రస్తుత తరానికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి మన దేశీయ పద్ధతులను మర్చిపోతున్న ప్రస్తుత విలాసవంతమైన సమాజానికి, మన పాత పద్ధతుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలను ఆమె సోదాహరణంగా వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే విదేశీ టాయిలెట్ (వెస్ట్రన్ కమోడ్) వాడకానికి స్వస్తి పలికి, మన భారతీయ టాయిలెట్ (స్క్వాటింగ్) విధానాన్ని అలవాటు చేసుకోవాలని ఆమె ప్రత్యేకంగా ప్రచారం చేస్తుండటం సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.
కేవలం చెప్పడమే కాకుండా, ఇండియన్ టాయిలెట్ విధానాన్ని ఎందుకు వాడాలో, దానివల్ల మన శరీరానికి కలిగే అసంఖ్యాకమైన ప్రయోజనాలను ఉపాసన కొణిదెల వివరిస్తున్నారు. విదేశీ టాయిలెట్ విధానం వల్ల పైల్స్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని, శరీర భంగిమ సరిగ్గా ఉండకపోవడం వల్ల పేగులపై సరైన ఒత్తిడి పడదని తెలుస్తోంది. అదే మన స్వదేశీ టాయిలెట్ విధానంలో కూర్చోవడం వల్ల పొట్టపై సహజమైన వత్తిడి పడుతుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు తోడ్పడటమే కాకుండా పొట్టకు ఒక మంచి వ్యాయామంలా సైతం పనిచేస్తుంది. మలబద్ధకం, పైల్స్ వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఇది సహజ సిద్ధంగానే కాపాడుతుందని ఆమె తన ప్రచారంలో స్పష్టం చేస్తున్నారు.
వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిరాలిగా ఉన్నప్పటికీ, ఏమాత్రం బేషజాలకు పోకుండా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా అపోలో లైఫ్ పేరిట ఆమె స్వయంగా ఈ విధానాలను ప్రమోట్ చేయడం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు తన వంతు బాధ్యతగా, సమాజం పెద్దగా మాట్లాడుకోవడానికి ఇష్టపడని ఇలాంటి చిన్న విషయాల్లో కూడా ఆమె ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఈ చర్య ద్వారా స్పష్టమవుతోంది. ఆరోగ్యం పట్ల అపారమైన శ్రద్ధతో సమాజానికి మేలు జరిగే విషయాలను ధైర్యంగా పంచుకుంటున్న ఉపాసన కొణిదెల ఆలోచనా విధానం, సామాజిక బాధ్యత పట్ల ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.