Mahaa Daily Exclusive

  అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే, మేయర్.

Share

 

*లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రేవూరి*

మహా వరంగల్ బ్యూరో ;

బల్దియా పరిధి 15, 16 వ వ డివిజన్ పరిధి లో ధర్మారం మొగిలిచెర్ల, పోతరాజు పల్లి గరీబ్ నగర్ ధర్మారం ప్రాంతం లో బల్దియా సాధారణ నిధులు, స్టాంప్ డ్యూటీ నిధులు రూ.2 కోట్ల 70 లక్షల అంచనా వ్యయం తో చేపట్టనున్న సి సి రోడ్ లు, ఇంటర్నల్ లైన్ నిర్మాణాల అంతర్గత డ్రైన్ లతో పాటు 16 డివిజన్ ధర్మారం లో జనరల్ ఫండ్ నిధులు రూ.50 లక్షల అంచనా వ్యయం తో నిర్మించిన మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ ను స్థానిక పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు.
అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న పలువురు లబ్ధి దారుల గృహ ప్రవేశ కార్యక్రమం లో మేయర్ తో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని సదరు గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ సుంకరి మనీషా శివ కుమార్ సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి ఏం హెచ్ ఓ డా.రాజేష్ హెచ్ ఓ లక్ష్మారెడ్డి ఈ ఈ సంతోష్ బాబు డి ఈ లు రంగారావు సతీష్ పి సి బి డైరెక్టర్ దయాకర్ పి ఎ సి ఎస్ డైరెక్టర్ యాదగిరి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.