Mahaa Daily Exclusive

  ఎన్డీఎస్ఏ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి: కేంద్ర మంత్రికి బండి సంజయ్ లేఖ!

Share

  • ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై చర్యలు తీసుకోవాలి
  • కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాసిన బండి సంజయ్
  • సీఎం రేవంత్ కార్యక్రమంలో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి

హైదరాబాద్, మహా : ఎన్ డీఎస్ఏ ఛైర్మన్ అనిల్ జైన్ పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను బండి సంజయ్ ప్రస్తావించారు. సీఎం రేవంత్‌‌రెడ్డి కార్యక్రమంలో ఆయన పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనెల 20వ తేదీన రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి మేడిగడ్డను సందర్శించారని, ఆ కార్యక్రమంలో అనిల్‌ జైన్‌ ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. భవిష్యత్తులో బ్యారేజీలకు మరింత నష్టం జరిగితే ఎన్డీఎస్ఏపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిందమోపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కమిటీ సిఫార్సులను నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రానికి చెడ్డపేరు తెచ్చేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహించారు. అనిల్‌ జైన్‌పై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి రాసిన లేఖలో బండి సంజయ్‌ సూచించారు.