కారేపల్లి, మహా : దుబ్బ తండ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. దుబ్బ తండ బస్ స్టాండ్ సెంటర్ లో చలివేంద్రాన్ని సర్పంచ్ ఆంగోతు మాత్రు నాయక్ కార్యదర్శి రఘు లు ప్రారంభించారు. వేసవి ఎండల దృష్ట్యా, ప్రయాణికులు, బాటసారుల దాహార్తిని తీర్చడానికి పంచాయతీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ మత్రు నాయక్ తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సహకారంతో గ్రామపంచాయతీ అభివృద్దికి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి గ్రామస్తుల సహకారం ఎంతో ఉందన్నారు. ఈకార్యక్రమంలో భూక్య లచ్చిరాం.బానోతు శ్రీరాం.మలోతు డకు . లక్ష్యం.నంద.గనేష్ . బాబురావు.రవి.రమేష్. గ్రామపంచాయతీ సిబ్బంది మహేష్ . రవి. హిట్లర్. రమేష్. బిల్ తీ. తదితరులు పాల్గొన్నారు.
Post Views: 33








