- కొండెక్కిన కోడి
- స్కిన్లెస్ రూ. 330, బోన్‌లెస్ రూ. 640
- వేసవి కాలం, పెళ్ళిళ్ళ సీజన్, సరఫరా తగ్గడమే కారణం
- జూన్ నెలాఖరు వరకు ఇంతే అంటున్న వ్యాపారులు
హైదరాబాద్, మహా : చికెన్ ధరలు రోజు రోజుకూ ప్రియమవుతున్నాయి. వారం రోజుల నుంచి మార్కెట్ లో చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వారం క్రితం స్కిన్‌లె్‌స చికెన్ కిలో రూ. 250-285 ఉండగా, ప్రస్తుతం రూ. 330కి చేరింది. దీంతో కిలో, రెండు కిలోలు కొనేవారు అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు. మటన్ కొందామన్నా కిలో రూ. 1,000 నుంచి రూ. 1,200 ఉంది. ఎండలు, పెళ్లిళ్ల సీజన్, సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయని, జూన్ నెలాఖరు వరకు ధరలు ఇలానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రస్తుతం చికెన్ ధరలు ఇలా..
చికెన్ లైవ్ బర్డ్ – రూ. 190-210
స్కిన్‌తో – రూ. 210-220
స్కిన్లెస్ – రూ. 330
బోన్‌లెస్ – రూ. 640-660
గుడ్లు (డజన్) – రూ. 72-80
Post Views: 1








