కారేపల్లి, మహా : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతురాలి కుటుంబానికి పదోతరగతి 2002 బ్యాచ్ విద్యార్ధులు అండగా నిలిచారు. సింగరేణి మండలం, మాదారం నిరుపేద కుటుంబానికి చెందిన బత్తుల భాగ్యలక్ష్మి కూలీ పనులకు వెళ్తూ ఇటివల కొత్తలింగాల క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె మఅతితో కుటుంబం దిక్కుతోచని స్ధితిలో నెట్టివేయబడింది. మృతురాలు భాగ్యలక్ష్మికి వరుణ్, కీర్తన అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతురాలి కుటుంబ నేపథ్యం తెలుసుకున్న 2002 బ్యాచ్ పదో తరగతి మిత్ర బృందం సాయం చేయటానికి ముందుకు వచ్చి రూ.16వేల ఆర్థిక సాయం ఆదివారం అందజేశారు. దానితో పాటు ఇద్దరు పిల్లలు పదో తరగతి పూర్తి అయ్యేంత వరకు వారికి కావల్సిన పుస్తకాల ఖర్చులను తామే భరిస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో ఉన్న కుటుంబానికి తోడుగా నిలిచిన పూర్వ పదోతరగతి విద్యార్ధులు సేవాభావాన్ని గ్రామస్తుచలు కొనియాడారు.








