- తులిస్యాతండా లోవోల్టేజి సమస్యకు పరిష్కారం…
- విద్యుత్ శాఖ అధికారులకు తండావాసుల కృతజ్ఞతలు
కారేపల్లి, మహా:నెలల తరబడి లోవోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న తులిస్యా తండా గ్రామానికి విద్యుత్ శాఖ అధికారులు అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో తులిస్యా తండా విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది.. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సూచనతో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు సమస్యకు పరిష్కారం చూపడంతో తండావాసులు విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కారేపల్లి మండలంలోని తులిస్యాతండా గ్రామ ప్రజలకు సింగిల్ ఫేస్ 25 కే వీఏ ట్రాన్స్ఫార్మర్ ను పెట్టడం ద్వారా “లో ఓల్టెజ్ సమస్య” కు పరిష్కారం లభించింది. గత కొన్ని నెలలుగా తులాస్యాతండా గ్రామంలో ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఉండటంవలన లో ఓల్టెజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నందున స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కొందరు నాయకులు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచనలతో వైరా విద్యుత్ శాఖ డిఈ యల్లంపల్లి రమేష్, ఏడిఈ యండి.యాసిన్ ల చొరవతో కారేపల్లి మండలం ఏఈ వెంకన్న సమస్య పరిష్కారానికి పూనుకున్నారు. సోమవారం విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి అదనంగా 25కేవీఏ సామర్ధ్యంగల ట్రాన్స్ఫార్మర్ ను అమర్చడం జరిగింది. నెలలు తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించడంతో తులాస్యాతండా గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడిఈ యాసిన్, ఏఈ వెంకన్న విద్యుత్ శాఖ సిబ్బంది ఫోర్ మెన్ లక్ష్మీనారాయణ. రషీద్, సర్పంచ్ దండు ప్రవీణ్, కాంగ్రెస్ లీడర్ నాగులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








