రైల్వే డబ్లింగ్ ఇళ్ల స్థలాలకు గజాల్లో పరిహారం చెల్లించాలి
*సింగరేణి సర్పంచ్ కు నిర్వాసితుల వినతి
*ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానన్న సర్పంచ్
కారేపల్లి, మహా: రైల్వే డబుల్ లైన్ పనుల కోసం చేపట్టిన భూసేకరణ లో ఇళ్ల స్థలాలు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ కారేపల్లి రైల్వే లైన్ నిర్వాసితులకు మంగళవారం కారేపల్లి సర్పంచ్ మేదరి టోనీ కి వినతి పత్రం సమర్పించారు. గతంలో అధికారులు ప్రకటించిన విదంగానే ఇళ్ల స్తలాలు కోల్పుతున్న వారందరికి గజాల చొప్పున చెల్లించాలని కోరారు.ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ…సింగరేణి గ్రామ పరిదిలో రైల్వే డబ్లింగ్ లో భాగంగా ఇళ్ల స్తలాలు కోల్పుతున్నామనీ,ఆ ఇళ్ల స్థలాలకు గజానికి రూ.6300 చొప్పున పరిహారం చెల్లిస్తామని గతంలో జరిగిన సమావేశాల్లో ప్రకటించారని తెలిపారు. అవార్డు ప్రకటించే ముందు ఇల్లు కోల్పోయిన వారికి మాత్రమే ఇళ్ల స్థలాలతో కలిపి గజాల చొప్పున కట్టిస్తామని అధికారులు పేర్కొంటున్నారని చెప్పారు.ఈ యొక్క భూ సేకరణలో కొందరి ఇల్లు మరికొందరి ఇల్లు మినహా ఆ ఇళ్లకు సంబందించిన స్తలాలు మాత్రమే సేకరించారనీ,గత 70 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు గానే ఉన్నాయనీ,వాటికి గజాల చొప్పున చెల్లిస్తేనే మాకు న్యాయం జరుగుతుందనీ కోరారు. ఏడు దశాబ్దాలు గా గ్రామం పరిధిలో ఇళ్ల మధ్య ఉన్న స్థలాలకు కన్వర్షన్ లెటర్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అడగటం ఏంటని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగేలా చూడాలని సర్పంచ్ ను కోరారు. దీనిపై స్పందించిన సర్పంచ్ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో సాదిక్ అలీ, తుమ్మలపల్లి కోటేశ్వరరావు,పరిటాల రవి,పాషా తదితరులు ఉన్నారు.








