- సాగు, ఉత్పత్తి పెరిగింది
- సన్ ఫ్లవర్ మద్ధతు ధర పెంచండి
- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరిన ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్, మహా : ఈ యాసంగిలో పండిన పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో పొద్దుతిరుగుడు పంట 21091 ఎకరాల నుంచి 27,675 ఎకరాలకు పెరిగిందని, పంట ఉత్పతి కూడా 13935 మెట్రిక్ టన్నుల నుంచి 19373 మెట్రిక్ టన్నులకు పెరిగిందని పేర్కొన్నారు. పొద్దు తిరుగుడు పంటకు కేవలం రూ. 5376 రూపాయల ధర మాత్రమే పలుకుందని, కనీస మద్దతు ధర 7721 వచ్చే విధంగా చూడలాని విజ్ఞప్తి చేశారు. మెదక్ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాలలో పంట మార్పిడిలో భాగంగా యాసంగి లో పొద్దు తిరుగుడు పంట ఎక్కువగా పండిస్తున్నారు. దయచేసి వెంటనే పంట పూర్తిగా మద్దతు ధరతో కొనుగోలు చేసే విధంగా సంబంధిత శాఖలకు సూచించాలంటూ విజ్ఞప్తి చేశారు.
Post Views: 3








