- తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం సిద్దం
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో అశ్విని వైష్ణవ్
ఢిల్లీ, మహా
రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్‌పై సమీక్షించారు. 42 ప్రధాన రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షలో చర్చించారు. కొత్త రైల్వేలైన్లు, హైస్పీడ్ రైల్ కారిడార్ పనుల పురోగతి అంశాలపై, హైదరాబాద్, పరిసర ప్రాంతాల ప్రయాణికులకు కీలకమైన ఎంఎంటీఎస్‌పై చర్చించారు. అధికారులతో భేటీ అనంతరం ఎంఎంటీఎస్ మెరుగుదలపై చర్యలు తీసుకుంటామని అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధిపై కేంద్రం పూర్తి అంకితభావంతో పని చేస్తోందని తెలిపారు.
Post Views: 11








