Mahaa Daily Exclusive

  సి.సి.కెమేరా ల పనితీరు మెరుగ్గా చూడాలి – ఎసై.రాజేష్ కుమార్

Share

దమ్మపేట ,మే 23 మహా :

మండల కేంద్రంలో సిసి కెమేరాల తీరు మెరుగ్గా ఉండాలని , ప్రమాద ఘటనా ప్రదేశాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎసై .బి. రాజేష్ కుమార్ కోరారు. శనివారం దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు ,ఉప సర్పంచ్ ఆంగోత్ శ్రీనివాస్ ,పంచాయతీ పాలక మండలి సబ్యులతో ఎసై సమావేశం అయ్యారు. ముందుగా నూతనంగా దమ్మపేట మండల ఎసై గా పదవీ బాద్యతలు చేపట్టిన ఎసై ను సర్పంచ్ శాలువాతో సత్కరించారు. మండలంలో శాంతి భద్రతలను రాజకీయాలకు అతీతంగా కాపాడాలని ఆమె కోరారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎసై మాట్లాడుతూ బెల్టు షాపుల వలన పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నట్లు ఫిర్యాదులు వస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల సహకారం తోనే శాంతిభద్రతలను అధుపులోకి తీసుకురాగలమని స్పష్టం చేశారు. అదేవిధంగా రహదారులపై ఆక్రమణలు తొలగించాలని , రోడ్లపై వాహనాలు నిలుపుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డ్రైనేజీ లకు వెలుపల బాగంలోనే దుకాణాలు ,వ్యాపారాలు చేయాలని , డ్రైనేజీ ఆక్రమణలు తొలగించాలని అందుకు పంచాయతీ ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సబ్యులు పానుగంటి లక్ష్మణ్ , దారా రాము ,శ్రీనివాస్ ,బత్తుల సాయి ,మహిళా వార్డు సబ్యులు పాల్గొన్నారు.

———–