Mahaa Daily Exclusive

  ANN News కథనానికి స్పందన… నార్సింగి సర్కిల్‌లో ముగ్గురు అధికారుల బదిలీ

Share

*ANN News కథనానికి స్పందన… నార్సింగి సర్కిల్‌లో ముగ్గురు అధికారుల బదిలీ*

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నార్సింగి సర్కిల్‌లో ఒకే రోజు ముగ్గురు అధికారుల బదిలీ చర్చనీయాంశంగా మారింది.

కోకాపేట్‌లో కొనసాగుతున్న భారీ అక్రమ నిర్మాణాలపై ANN News ప్రసారం చేసిన కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్, టౌన్ ప్లానింగ్ అధికారి (TPO) మౌనికలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కోకాపేట్ ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు, ప్రభుత్వ ఆదాయానికి జరుగుతున్న నష్టం, అధికారుల పర్యవేక్షణ లోపాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని ఉన్నతాధికార వర్గాలు సూచిస్తున్నాయి.

ANN News వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలపై ప్రభుత్వం, మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల తర్వాత కోకాపేట్‌లోని అక్రమ నిర్మాణాలపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.