Mahaa Daily Exclusive

  రైతుల ప్రయోజనం కోసమే 15వేల మెట్రిక్ టన్నుల గోదాం ఏర్పాటు….

Share

  • రైతుల ప్రయోజనం కోసమే 15వేల మెట్రిక్ టన్నుల గోదాం ఏర్పాటు-రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
  • సింగరేణి మండలం గుట్టకిందగుంపు గ్రామంలో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

కారేపల్లి,మహా:
రైతుల ప్రయోజనం కోసమే గిడ్డంగుల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే సింగరేణి మండల పరిధిలోని గుట్ట కింది గుంపు గ్రామంలో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి పూనుకున్నట్లు రాష్ట్ర గెడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల నుండి వారు పండించిన ప్రతి పంటగింజను కొనడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ వస్తున్నదని తెలిపారు.వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి మండల పరిధిలో ఉన్నటువంటి మెజారిటీ గిరిజన రైతాంగానికి గోదాం ఎంతగానో లాభదాయకంగా ఉంటుందని అన్నారు.ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజారంజక పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు.అనంతరం వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ దుర్గా ప్రసాద్,ఎమ్మార్వో వెంకటేశ్వర్లు,ఎంపీడీవో మల్లెల రవీంద్ర ప్రసాద్,సొసైటీ చైర్మన్ సొసైటీ దుగ్గినేని శ్రీనివాసరావు,జిల్లా నాయకులు పగడాల మంజుల,పర్సా పట్టాభి రామారావు,స్థానిక సర్పంచ్ ఉండం రాఘవులు,సొసైటీ డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్య,ఏపీఎం వెంకటేశ్వర్లు,ఏఈలు వెంకన్న,నరేందర్,సిఐ సాగర్, ఎస్సై బైరు గోపి,సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్,సర్పంచులు మేదరి వీరప్రతాప్,హీరాలాల్,కిరణ్,హనుమంతు,మతృ నాయక్, వడ్డే సులోచన,రాందాస్ నాయక్, భూక్యా పద్మ,కాంగ్రెస్ మండల నాయకులు పెద్దబోయిన ఉమాశంకర్,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి వాంకుడోత్ గాంధీ,తదితరులు పాల్గొన్నారు.