అగ్గి… బుగ్గి….
మంటలు… ఆరని మంటలు… హడాలెత్తిస్తున్న ఘటనలు… అగ్నికి ఆహుతి అవుతున్న జనాలు… బుగ్గి పాలవుతున్న కోట్ల రూపాయల సంపద… ఇది ఇప్పుడు దేశంలో నిత్యం జరుగుతున్న ఘోరకలి… ఈ వేసవిలో రికార్డ్ స్థాయిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవటం కలవరం రేపుతోంది… ప్రమాదాల వెనుక అసలు కారణం మాత్రం నిర్లక్ష్యమే… అదే నిప్పుగా మారి పెను ముప్పు తెచ్చి పెడుతోంది… దేశంలో ప్రతీ రోజు అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి.. అన్నింటికీ ఒక్కటే కారణంగా అధికారులు చెప్పటం పరిపాటిగానూ మారుతోంది… అదే షార్ట్ సర్క్యూట్… అంటే మానవ తప్పిదం ఏమి లేదని… ఇట్టే చెప్పేస్తున్నారు… నిజానికి ప్రతీ అగ్ని ప్రమాదం వెనుక మానవ తప్పిదం ఉందన్నది కాస్త ఆలోచించే వారికి ఇట్టే అర్ధం అవుతుంది… ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి… 47 డిగ్రీలను మించిన వేసవి తాపం ప్రజలకు ముచ్చేమటలు పట్టించి ముప్పతిప్పలు పెడుతున్నాయి… ఉపశమనం కోసం ఫ్యాన్, ఏ సీ వాడకం తప్పని సరి అయింది… ఇదే పెద్ద ప్రమాదాలకు కారణం అవుతోంది… విరామం లేకుండా వాడే ఫాన్స్, ఏ సీ ల వల్ల మంటలు పుట్టుకు వచ్చి చూస్తుండగానే పెను ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయి… పరిస్థితి అర్ధం చేసుకునేలోగానే జరగవల్సిన అనర్థం జరిగితూనే వుంది… ఈ ఏడాది వేసవి కాలం దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో అగ్ని ప్రమాదాలు జరిగాయి… లక్షల కోట్ల ఆస్తులు బుగ్గి అయ్యాయి… ఇక అగ్ని ప్రమాదాలలో వేయి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు… 38 వేల మందికి పైగా గాయపడ్డారు…వంట గ్యాస్ సిలిండర్ల పేలుళ్ళు కూడా ఇందులో వున్నాయి…ప్రతీ అగ్ని ప్రమాదం వెనుక నిర్లక్ష్యం ఉండటం గమనార్హం…








