Mahaa Daily Exclusive

  ‘న్యూయార్క్ టైమ్స్’ హెచ్చరిక: నిప్పుతో చెలగాటం… ఇకనైనా మారదా ఈ నిర్లక్ష్యం?

Share

విద్యుత్ వాడకం పై మన దేశంలో అవగాహన చాలా తక్కువగా ఉందని న్యూయార్క్ టైమ్స్ స్పష్టంగా చెప్పింది… ప్రతీ మూడేళ్లకు ఓ సారి ప్రతీ విద్యుత్ కనెక్షన్ కు సంబందించిన పర్యవేక్షణ తప్పనిసరిగా చెప్పుకొచ్చిన న్యూయార్క్ టైమ్స్ ఇండియాలో ఇది మచ్చికైనా లేదని చెప్పేసింది… విద్యుత్ వాడకం కోసం ఏళ్ల క్రితం వేసిన వైరింగ్ పట్టించుకునే వారే వుండరు… ఇక అదే పనిగా విద్యుత్ వాడుతూ ప్రమాదా లకు ఆస్కారం ఇచ్చే వారు చాలా మందే వున్నారు… ఇక ఘోరం జరిగినప్పుడు మాత్రమే స్పందించే అధికారులు సరేసరి…ప్రస్తుతం దేశంలోఈ ఏడాది జరిగిన అగ్ని ప్రమాదాలు భవిష్యత్ లో జరగబోయే ఘోర ప్రమాదాలకు ఓ హెచ్చరికగా నిపుణులు చెప్పుకుని వస్తున్నారు… ముఖ్యంగా దేశంలో ఇప్పుడు నగరాలు శర వేగంగా విస్తరిస్తున్నాయి… బహుళ అంతస్థులు పెరిగిపోతున్నాయి… వీటిల్లో నివాసం వుండే వారి సంఖ్య పెరుగుతోంది… ఇటు వ్యాపారం, వాణిజ్య, పరిశ్రమ రంగాలు వృద్ధి చెందు తున్నాయి… మనిషి నిలబడే స్థలం ఉంటే చాలు… ఆ స్థలంలోనే వ్యాపారం చేసే పరిస్థితి ఇప్పుడు వుంది… ఇదే నేపథ్యంలో విద్యుత్ వినియోగించుకునే వారి సంఖ్య అపరిమితం అవుతోంది… దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అగ్ని మాపక సంస్థ మరింత బాధ్యతయుతంగా అడుగులు వేయాలి… ముఖ్యంగా అత్యంత బహుళ అంతస్థుల నిర్మాణం సమయంలోనే అగ్ని ప్రమాద రహిత వ్యవస్థల ఏర్పాటు పై దృష్టి పెట్టాలి… ప్రమాదం జరిగిన ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలను నిశితంగా పరిశీలన చేయాల్సిందే… అప్పుడే అనుమతులు ఇవ్వాలి.. ఇదే విధంగా వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల విషయంలోనూ సంబంధిత అధికారులు గట్టిగా వ్యవహరించ వల్సిందే… ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ఢిల్లీ హోటల్ ఘటన, హైదరాబాద్ అమీరుపేట ఘటనల వంటివి మళ్ళీ, మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి… నిప్పుతో చెలగాటం ఎప్పటికి అయినా ముప్పేనని ప్రజలను పదే పదే అప్రమత్తం చేయాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తోంది… కించిత్తు జాగ్రత్త అనేక అనర్దాలకు అడ్డు గోడగా నిలుస్తుంది… బాధ్యతగా ఉందాం… నిప్పు ముప్పును తప్పించుకుందాం…

జీ. వెంకటరమణ…

సీనియర్ జర్నలిస్ట్…