Mahaa Daily Exclusive

  ధాన్యరాశుల తెలంగాణ… తీరని అన్నదాత ఆవేదన: నవ్విన నాప చేను పండినా తప్పని కష్టాలు!

Share

భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికి చెడిపోరు అన్న పెద్దల మాటలు ఇప్పుడు తెలంగాణ రైతులు నిజం చేసి చూపిస్తున్నారు… తెలంగాణ అంటే కరువు ప్రాంతం… అక్కడ పొలాన్ని నమ్ముకోవటం కన్నా అమ్ముకోవటం బెస్ట్ అంటూ ఒకప్పుడు ఎగతాళి చేసిన వారు లేకపోలేదు… కానీ ఇప్పుడు ఏకంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన తెలంగాణ రైతులు తమను చూసి నవ్విన వారికి ధాన్య రాసులు కుప్పలుగా పోసి సమాధానం ఇచ్చిన తీరు మరువ లేనిది…వరి, జొన్న, మొక్కజొన్న, వేరు సెనగ, చివరికి నూనె ధాన్యాల పంటలతో ఇప్పుడు తెలంగాణ రైతు ముందు వరుసలో నిలిచిన తీరు అబ్బుర పరుస్తోంది… ఇంతలో ఎంత మార్పు… నవ్విన నాప చేను పండింది… అన్న సామెత ఇప్పుడు తెలంగాణలో నిజం అయింది… అంతా బాగానే వుంది… రైతు పరిస్థితే ఇబ్బందిగా వుంది… పంట పండిన దాన్ని అమ్మేందుకు ఆగచాట్లు తప్పట్లేదు… మార్కెట్ లో పడిగాపులు పడే దుస్థితి మారటం లేదు… ధాన్యం కుప్పల మీదే రైతుల ప్రాణాలు పోతున్న ఘటనలు ఆవేదన, ఆందోళన కలిగిస్తూనే వున్నాయి… మరో వైపు మార్కెట్ మాయజాలం రైతును నిలువు దోపిడీ చేస్తూనే వున్నాయి… మార్కెట్ లో గిట్టుబాటు ధరలు అన్నదాత వెన్ను విరుస్తూనే వున్నాయి… తరుగు, నాణ్యత అంటూ దెబ్బ తీసే పరిస్థితి కొనసాగుతూనే వుంది… ఇది చాలదు అన్నట్టు అకాల వర్షాలు రైతును నిండా ముంచుతూనే వున్నాయి…