వ్యవసాయం మొదలు పెట్టిన తొలి రోజు నుంచే రైతుకు సమస్యలు మొదలు అవుతున్నాయి… కూలీల కొరత, విత్తనాలు కొరత వేదిస్తూనే వెంటాడుతున్నాయి… ఇక పెట్టుబడులు కోసం అవస్థలుపడుతునే వున్నారు… సకాలంలో బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితి… ఇక ప్రైవేట్ వ్యక్తుల నుంచే రైతు అధిక వడ్డీలు చెల్లించి డబ్బులు తెచ్చుకోక తప్పట్లేదు… యూరియా కోసం రైతులు నిద్ర లేని రాత్రులు గడపటం చూస్తూనే వున్నాం… మార్కెట్ లో నకిలీ విత్తనాల బెడద రైతుకు శాపంగానే వుంది… అన్ని అడ్డంకులు దాటి ఎట్టకేలకు పంట పండిస్తే గిట్టుబాటు ధరలు చూసి రైతు చేష్టలుడిగి పోతూనే వున్నాడు… ఇవి చాలవు అన్నట్టు ఇప్పుడు భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త ఒకటి చెప్పుకువచ్చింది… అదే ఎల్ నినో… ఈ ఏడాది కరువు తప్పదు అంటూ చావు కబురు చల్లగా చెప్పేసింది… రైతు ఆశలపై నీళ్లు చల్లేసింది…ఈ ఏడాది సాధారణ వర్షాలు కూడా పడటం కష్టమంటూ నిపుణులు కూడా అంటున్నారు… ఇదే ఇప్పుడు రైతుకు పెద్ద దిగులుగా మారింది… ఇక ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం ఏం చేయబోతున్నాయి… రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం… మాది రైతు పక్షపాత ప్రభుత్వం అంటూ చెప్పుకునే ప్రభుత్వాలు ఇప్పుడు రైతును ఎలా ఆదుకుంటాయి… ఇప్పటి వరకు అయితే వచ్చే సంక్షోభం పై ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు… మున్ముందు ఏం చేస్తాయో తెలీదు… కరువు పరిస్థితి వస్తే రైతును ఎలా ఆదుకుంటాయి… రైతు కుటుంబం ఎలా బతుకు సాగిస్తుంది… ఇదే ఇప్పుడు ఓ పెద్ద సవాల్… ప్రభుత్వాలు ఇప్పటి నుంచే కరువును ఎదురుకునేందుకు సన్నద్ధం కావాలి… లేకపోతే ఇక్కట్లు తప్పవు… అన్నదాతకు ఆగచాట్లు వీడవు…
జీ. వెంకటరమణ…
సీనియర్ జర్నలిస్ట్…








