- మానవ మనుగడకు జీవనాధారం ప్రకృతి
- ఇబ్రహీంపట్నం సుస్థిరాభివృద్ధే లక్ష్యం..పర్యావరణాన్ని కాపాడుకుందాం…
- విస్తరిస్తున్న పట్టణీకరణకు తోడు ప్రకృతి పరిరక్షణ ముఖ్యం….
- నియోజకవర్గం ప్రజలకు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు…
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి…
ఇబ్రహీంపట్నం జూన్ 5 మహా:
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రోజురోజుకు హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారులో ఉన్న ఇబ్రహీంపట్నం పట్టణీకరణకు గురవుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఓ వైపు అభివృద్ధిని స్వాగతిస్తూనే… మరోవైపు పర్యావరణ పరిరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మానవ మనుగడకు జీవనాధారమైన ప్రకృతిని పరిరక్షిస్తూూ… భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలువాలని చెప్పారు. ఒక్కొక్కరు ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి చిన్నచిన్న చర్యలే రేపటి తరాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన భూమిని అందించగలవని పేర్కొన్నారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్-జీరో సిటీగా మార్చే లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని… ఇందులో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న వారికి ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు.








