Mahaa Daily Exclusive

  రైతుకు మద్దతు ధర కల్పనే ప్రభుత్వ లక్ష్యం…

Share

  • రైతుకు మద్దతు ధర కల్పనే ప్రభుత్వ లక్ష్యం
  • మొక్కజొన్న పట్టుబట్టి కొనుగోలు చేయించా
  • మాధారంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కారేపల్లి, మహా:రైతుకు మద్దతు ధర దక్కాలన్నదే ప్రభుత్వ ద్యేయమని దానిలో భాగంగానే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. గురువారం కారేపల్లి మండంలో మాధారంలో రూ. 30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ, రూ..10 లక్షలతో చేపట్టే గ్రామసమాఖ్య భవనం పనులను సర్పంచ్ అజ్మీర ఉమారాణితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అధికారులతో మండల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కారేపల్లి మండల రైతుల ప్రయోజనాల కోసం పట్టుబట్టి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించానన్నారు. ఈ కేంద్రం ద్వారా 807 మంది రైతులకు చెందిన 49950 క్వింటాళ్లు రూ. 12 కోట్ల విలువైన మొక్కజొన్న కోనుగోలు చేసిరైతులకు డబ్బులు బ్యాంకు ఖాతాలలో జమ చేశామన్నారు. కారేపల్లి మండలం అప్పాయిగూడెంలో గోదాం ఉండటంతో మండల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొక్కజొన్న గోదాం పంపటం డబ్బులు జమ కావటం జరిగిందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకోని రూ.20 కోట్లతో గుట్టకిందిగుంపు వద్ద గోదాం నిర్మించటం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అభివృధ్ధి ఫలాలు అందిస్తున్నామని ఆ లెక్కలు క్షేత్రస్ధాయిలో ప్రచారం కావటం లేదన్నారు. ప్రతి ఒక్కరి వద్ది ప్రభుత్వం అభివృద్ధి లెక్కలు ఉండాలన్నాను. ప్రభుత్వ నుండే కాకుండా సింగరేణి సంస్ధ ద్వారా కూడా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 200 హైమాక్స్ లైట్లు తెప్పించానన్నారు. పోడు రైతులకు బోర్లు, కరెంటు ఇప్పించానన్నారు. బీఆర్ఎస్ పాలనలో గిరిజనులకు ఆర్ధికంగా సపోర్టు చేసే ఐటీడీఏ ను అధోగతి పాలు చేశారన్నారని విమర్శించారు. ప్రజలు అభివృద్దిని గమనించి ఆశీర్వదించాలని కోరారు. ఈకార్యక్రమంలో సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, డీసీసీ ఉపాధ్యక్షులు పగడాల మంజుల, బానోత్ రాంమ్మూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు భూక్య రంజిత్ కుమార్, సోసైటీ మాజీ అధ్యక్షులు ఈసాల నాగేశ్వరరావు, తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్, ఎంఈవో దుగ్గిరాల జయరాజు, సూపర్నిటెండెంట్ మల్లెల రమేష్, ఏఈలు వెంకన్న, నరేందర్, రాజశేఖర్, ఆర్ఐలు జగదీష్, అబ్దుల్ అలీ, సర్పంచ్ లు బానోతు హీరాలాల్, మేదరి వీరప్రతాప్, అంగోత్ మత్రు, దరావత్ వెంకటేశ్వర్లు, ఈసం మోతీరస్వామి, పూనెం ఎల్లయ్య, బానోత్ పద్మ, బానోత్ రాందాస్, దండు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Latest