Mahaa Daily Exclusive

  సంధ్య థియేటర్ ఘటనలో….

Share

  • సంధ్య థియేటర్ ఘటనలో
  • నటుడు అల్లు అర్జున్ కు కోర్టు సమన్లు
  • సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్, మహా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. సోమవారం విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ-11గా పోలీసులు చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకూ నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. వీరి వ్యక్తిగత హాజరు తర్వాత విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

అసలేం జరిగిందంటే?

2024, డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. థియేటర్‌కు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు దూసుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌ను కూడా బాధ్యున్ని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అరవింద్‌తో పాటు మూవీ టీం అండగా నిలిచింది. ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందించడం సహా శ్రీతేజ్ వైద్యానికి సాయం అందించారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకున్నాడు.

Latest