రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా డాక్టర్ సెల్ ఆధ్వర్యం లో మెగా రక్తదాన శిబిరం
హైదరాబాద్, గాంధీ భవన్ : ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్‌లో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం టీపీసీసీ డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, వైద్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.
రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు జీవనాధారం అందించవచ్చని డాక్టర్ రాజీవ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాతలను అభినందించారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలే రాహుల్ గాంధీ ఆశయాలకు నిజమైన సాక్షం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సేవకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
మంత్రి సీతక్క ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు .
యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
250 మందికి పైగా రక్తదానం చేయడంతో కార్యక్రమం ఘనవిజయం సాధించింది. సేకరించిన రక్తాన్ని అవసరమైన రోగులకు అందించేందుకు ప్రభుత్వ హాస్పిటల్స్ కి అప్పగించినట్లు నిర్వాహకులు తెలిపారు.
రక్తదానం మహాదానం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డాక్టర్ రాజీవ్ పేర్కొన్నారు.







