ప్రజా సమస్యల పరిష్కారమే MGR లక్ష్యం
ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్ ఇంద్ర నగర్‌లో సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పర్యటించారు.
గత 8 నెలలుగా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళలు పెద్ద ఎత్తున తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు GHMC అధికారులకు తెలియజేసినా స్పందన లేకపోవడంతో MGR గారు స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు GHMC SE విజయ్ కుమార్ గారు, AE వెంకటేష్ గారుతో ఫోన్‌లో మాట్లాడి రోడ్డు సమస్య తీవ్రతను వివరించారు. దీనికి స్పందించిన అధికారులు వారం రోజులలో రోడ్డు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే, ప్రాంతంలో తీవ్రంగా ఉన్న నీటి సమస్యపై మేనేజర్ రాంబాబు గారితో మాట్లాడి, సమయపాలన లోపం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల కోసం ఎప్పుడూ ముందుండే నాయకుడు — మన MGR గారు








