- సర్కార్ ఉద్యోగుల ఇన్సూరెన్స్ స్కీం ప్రారంభం.
- హాజరైన టీఎన్జీవో అధికారులు ఊటు యశ్వంత్, శ్రీనివాసరావు..
హర్షం వ్యక్తం చేసిన సర్కారు ఉద్యోగులు..
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన ఎంప్లాయిస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం ప్రారంభోత్సవానికి హాజరైన రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఊటు యశ్వంత్, శ్రీనివాసరావు ఇతర అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎటువంటి ప్రీమియం చెల్లింపు, విరాళం లేకుండా సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా అందిస్తుంది. రాష్ట్రంలోని 1.20 కోట్ల ప్రభుత్వం ఉద్యోగుల బీమా పథకానికి సంబంధించి ప్రభుత్వం అన్ని బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ స్కీం అమలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని వారు తెలిపారు. ఈ స్కీం అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రేస్సా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సుధాకర్, ఎన్జీవో నేతలు సురేష్ ,అన్నపూర్ణ, చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు శివకుమార్ గాయత్రి, వాణి, ఆమనగల్లు యూనిట్ ప్రెసిడెంట్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.








