ఖైరతాబాద్ నియోజకవర్గ వెంకటేశ్వర డివిజన్ శ్రీ నికేతన్ కాలనీ లో నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం BLO షేక్ అక్రమ్ BLA సుదీర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక పరిశీలన ప్రక్రియను వారు పరిశీలించారు.
కాలనీలోని ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటరు జాబితాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదు కావడం, మరణించినవారి పేర్లు లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను సరిచేయడం వంటి అంశాలపై అధికారికి సూచనలు చేశారు.
ఓటరు జాబితా ఎన్నికల ప్రక్రియకు పునాది అని పేర్కొంటూ, శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో అవసరమని అన్నారు.
అర్హులైన ప్రతి పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవాలని సూచించారు.
అలాగే, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారికి ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి గారు, మరియు ప్రేమ్ వెంకట కోటిరెడ్డి, దామోదర్ నాయుడు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు








